శాంతిభద్రతల పరిరక్షణకు మత్స్యకారులు సహకరించాలి

ABN , First Publish Date - 2020-12-17T05:43:53+05:30 IST

తీర ప్రాంత గ్రామాల్లో శాంతిభ ద్రతలకు భంగం వాటిల్లకుండా మత్స్యకారులు సహకరించాలని ఒంగో లు రూరల్‌ సీఐ సుబ్బారావు కోరారు.

శాంతిభద్రతల పరిరక్షణకు మత్స్యకారులు సహకరించాలిసీఐ సుబ్బారావు


నాగులుప్పలపాడు, డిసెంబరు 16 : తీర ప్రాంత గ్రామాల్లో శాంతిభ ద్రతలకు భంగం వాటిల్లకుండా మత్స్యకారులు సహకరించాలని ఒంగో లు రూరల్‌ సీఐ సుబ్బారావు కోరారు. బుధవారం  మండలంలోని కనప ర్తి శివారు గ్రామం చిన్నంగారిపట్టపుపాలెం, పల్లెపాలెంలో మత్స్యకారు లతో పోలీసులు సమావేశాలు నిర్వహించారు. గతంలో ఆయా గ్రామాల మధ్య సముద్ర తీరంలో ఉన్న భూములకు సంబంధించి వివాదం ఉం ది. గత ఏడాది పల్లెపాలెంకు చెందిన సొసైటీ భూములను మాజీ ఎ మ్మెల్యే ఆమంచి బంధువులు కొనుగోలు చేసి సుమారు 20 ఎకరాల్లో చేపల చెరువుల సాగుకు యత్నంచారు. ఆ సమయంలో చిన్నంగారిప ట్టపుపాలెంకు చెందిన పట్టపు కారులు  అడ్డుకున్నారు. ఆ భూములను తాము ఎండు చేపలు ఆరబెట్టుకొనేందుకు వాడుకుంటున్నామని చెప్ప డంతో నాడు ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. అయితే ప్రస్తు తం చీరాల వాడరేవులో పల్లెకారులు, పట్టపుకారుల మధ్య వివాదం రే గిన నేపథ్యంలో ఆ ప్రభావం చిన్నంగారిపట్టపుపాలెం పట్టపుకారులు, పల్లెపుకారుల మధ్య ఉద్రిక్తత జరగకుండా సీఐ సుబ్బారావు, ఇన్‌చార్జి ఎస్‌ఐ రాజారావులు కాపులతో సమావేశం నిర్వహించారు. సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకు ంటామని చెప్పారు. మత్స్యకారులు శాంతియుతంగా ఉండాలని కోరారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు నిఘా ఏర్పాటు చేశారు. 


Updated Date - 2020-12-17T05:43:53+05:30 IST