సచివాలయ వ్యవస్థ పటిష్టతతో క్షేత్రస్థాయి అభివృద్ధి
ABN , First Publish Date - 2020-10-08T09:51:15+05:30 IST
క్షేత్రస్థాయిలో అభివృద్ధి సాధించాలంటే గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. మండలంలోని మన్నేటికోట

కలెక్టర్ పోలా భాస్కర్
ఉలవపాడు, అక్టోబరు 7 : క్షేత్రస్థాయిలో అభివృద్ధి సాధించాలంటే గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. మండలంలోని మన్నేటికోట గ్రామ సచివాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బంది పనితీరును ఒక్కొక్కరిగా అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు 478 సేవలకు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోగా అందులో 102 సకాలంలో పరిష్కరించలేదని తేలింది.
దీనిపై ఆయన స్పందిస్తూ, గ్రామ సచివాలయాల నుంచి వందలాది ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఏయే సేవలకు ఎన్ని గంటలు, ఎన్ని రోజుల్లో అందించాలనే సేవల పట్టిక సచివాలయం బయట ఉంచాలన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో, వైద్యఆరోగ్యశాఖలు సచివాలయ పనితీరును సక్రమంగా పర్యవేక్షించాలని చెప్పారు. కొవిడ్ చికిత్స కోసం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల జాబితాను సచివాలయంలో అందుబాటులో ఉంచాలన్నారు. సేవల ద్వారా వచ్చిన నగదును ఎప్పటికప్పుడు సంబంధిత బ్యాంక్ ఖాతాలో జమచేయాలన్నారు.
రాజుపాలెం జంక్షన్‌ను పరిశీలించిన హైవే అధికారులు
మార్టూరు, అక్టోబరు 7 : జాతీయరహదారిపై మండల పరిధిలోని రాజుపాలెం జంక్షన్ వద్ద అండర్‌పా్‌సను నిర్మించాలా, వద్దా అనేది ఢిల్లీ స్థాయిలో నిర్ణయిస్తారని హైవే అధికారులు చెప్పారు. ఒంగోలు నుంచి వచ్చిన ముగ్గురు హైవే అధికారుల బృందం రాజుపాలెం జంక్షన్‌ను పరిశీలించింది. ఈ రోడ్డు వద్ద అండర్‌పాస్ నిర్మించకపోవడంతో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారని ఇటీవల రాజుపాలేనికి చెందిన డాక్టరు వేలూరి కృష్ణమూర్తి పలువురు గ్రామస్థులతో కలిసి నెల్లూరు వెళ్లి హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను కలిశారు.
దీంతో బుధవారం ఈ రోడ్డు పరిశీలనకు వచ్చిన అధికారులు అండర్‌పాస్ నిర్మించడం తమ చేతుల్లో లేదని, ఢిల్లీ స్థాయిలో అనుమతులు రావాలన్నారు. బాపట్ల ఎంపీ ద్వారా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని గ్రామస్థులకు సలహాఇచ్చారు. వారిని కలిసిన వారిలో డేగరమూడికి చెందిన జంపాని వీరయ్య, జాగర్లమూడి వీరయ్య, బలరాం, రాజుపాలెంకు చెందిన వేలూరి కృష్ణమూర్తి, అమర్నేని వెంకట్రావు ఉన్నారు.
సచివాలయ వ్యవస్థపై సీఎం నిరంతర పర్యవేక్షణ
సచివాలయ వ్యవస్థపై సీఎం జగన్మోహనరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో 879, పట్టణ ప్రాంతంలో 177 సచివాలయాల నిర్మాణాలు శరవేగంగా జరిగాయన్నారు. ప్రతి సచివాలయానికి అనుబంధంగా వ్యవసాయ. ఆరోగ్య శాఖ సేవలు గ్రామ స్ధాయిలో అందించెందుకు రైతుభరోసా, హెల్త్ సెంటర్లు నిర్మిస్తునట్లు చెప్పారు.
అనంతరం నిర్మాణ దశలో ఉన్న సచివాలయం, రైతుభరోసా కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో కందుకూరు సీఐ విజయ్‌కుమార్, తహసీల్దార్ సంజీవరావు, ఎంపీడీవో రవికుమార్, వ్యవసాయశాఖ అధికారిణి వెంకటశేషమ్మ, ఎస్సై దేవకుమార్, కరేడు వైద్యాధికారి శ్రీనివాసరావు, పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి భాస్కర్, వీఆర్‌వో వెంకటాద్రి, సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు.