ఎరువుల దుకాణంలో చోరీ

ABN , First Publish Date - 2020-05-11T11:25:22+05:30 IST

స్థానిక శ్రీలక్ష్మీ వెంకటరమణ ట్రేడర్స్‌ ఎరువుల దుకాణంలో శనివారం రాత్రి దొంగలు చోరీ చేశారు. క్యాష్‌టేబుల్‌లో

ఎరువుల దుకాణంలో చోరీ

కిటికీ తలుపు వెనుకగల గ్రిల్‌ గుండా  దుకాణంలోకి  ప్రవేశించిన దుండగులు.. 

క్లూస్‌టీమ్‌తో పరిశీలన


తాళ్లూరు, మే 10 : స్థానిక శ్రీలక్ష్మీ వెంకటరమణ ట్రేడర్స్‌ ఎరువుల దుకాణంలో శనివారం రాత్రి దొంగలు చోరీ చేశారు.  క్యాష్‌టేబుల్‌లో నగదు రూ.20 వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై నాగరాజు కేసు నమోదు చేశారు. వారి కఽథనం మేరకు... గుర్తు తెలియని దొంగలు శనివారం రాత్రి ఎరువుల దుకాణంలోకి ప్రవేశించేందుకు ఉత్తరం వైపు ఉన్న కిటికీ తలుపులు లాగి ఇనుపగ్రిల్స్‌ వంచి లోపలకెళ్లారు. ముందు వైపు షట్టరు తలుపు వద్ద క్యాష్‌ టేబుల్‌ను చిందరవందర చేసి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే దుకాణం యజమాని ఇడమకంటి హనుమారెడ్డి షట్టర్‌ తీయగానే క్యాష్‌టేబుల్‌ చిందరవందరగా పడిఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వై.నాగరాజు దుకాణాన్ని, చోరీ జరిగిన తీరును అన్ని కోణాల్లో పరిశీలించారు.


దుండగులను గుర్తించేందుకు క్లూస్‌టీమ్‌ను రప్పించారు. వేలిముద్రల సేకరణ అధికారి డీఎస్‌ కోటేశ్వరరావు, సిబ్బంది వచ్చి దుండగులు తాకిన ప్రదేశాల్లో వేలిముద్రలు సేకరించారు. దుకాణంలోకి తరచూ వచ్చి వెళ్లే వ్యక్తే చోరీకి పాల్పడి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంచిన ఇనుప గ్రిల్‌ను పరిశీలిస్తే సన్నటి వ్యక్తులు మాత్రం లోనికి దూరి ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-05-11T11:25:22+05:30 IST