వణికిస్తోన్న కరోనా భయం

ABN , First Publish Date - 2020-05-29T10:22:42+05:30 IST

కరోనా భయం వెంటాడుతూనే ఉంది. జిల్లాలో గురువారం మరో ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

వణికిస్తోన్న కరోనా భయం

ఒంగోలు నగరం, మే 28 : కరోనా భయం వెంటాడుతూనే ఉంది. జిల్లాలో గురువారం మరో ఆరు  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80కి చేరింది. ఆరు కేసులు బయటి నుంచి వచ్చిన వారే. హనుమంతునిపాడు మండలం నల్లగండ్ల గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరంతా చెన్నైలోని ఒక కళాశాలలో పనిచేస్తున్నారు. వారం క్రితం గ్రామానికి వచ్చారు. వారిని పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ తేలింది. అలాగే కంభంకు చెందిన ఒకరికి కూడా పాజిటివ్‌ తేలింది. ఇతను గుంటూరులో ఓ ఆస్పత్రిలో వైద్యం పొంది ఇటీవల ఇంటికి వచ్చారు. వీరికి వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చింది. వీరంతా ఇళ్లలోనే ఉన్నారు. వీరిని రిమ్స్‌ ఐసోలేషన్‌ వార్డుకు శుక్రవారం తరలిస్తారు.


కంటైన్మెంట్‌ నిబంధనలు మార్పు

జిల్లాలో కంటెన్మెంట్‌ ఏరియాలను కుదిస్తున్నారు. గత 28రోజులుగా కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు కాని ప్రాంతాలను కంటైన్మెంట్ల జాబితా నుంచి తొలగించనున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కంటైన్మెంట్‌ ఏరియా నిబంధనలకు కొంత సడలింపు ఇవ్వటంతో చాలారోజులుగా కొత్త కేసులు నమోదు కాని ప్రాంతాలను కంటైన్మెంట్‌ జాబితా నుంచి తొలగించి అక్కడి ప్రజలకు ఇబ్బందులను తొలగించనున్నారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు కలెక్టర్‌ అనుమతి కోసం ఫైల్‌ను సిద్ధం చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఒంగోలులోని ఇస్లాంపేట, పీర్లమాన్యం, బిలాల్‌నగర్‌, కొప్పోలు, చీమకుర్తి, చీరాల్లోని పేరాల, నవాబుపేట, కారంచేడు, కందుకూరు, గుడ్లూరు, కనిగిరి, మార్కాపురం, కొనకనమిట్ల, రావినూతల, పొదిలి, కొత్తపట్నం మండలం రాజుపాలెం, దర్శి ప్రాంతాలు కంటైన్మెంట్లుగా ఉన్నాయి. 


రాజుపాలెం గుండెగుబేలు..

రెండురోజుల క్రితం చీమకుర్తి మండలం రాజుపాలెంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. విజయవాడ నుంచి రాజుపాలెం వచ్చిన యువకుడికి కరోనా తేలింది. అయితే ఈ యువకుడు రాజుపాలెంలో జరిగిన ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన విందులో అతను వడ్డించే పనిని కూడా చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి పొదిలి మండలం సళ్ళూరు, కాటూరివారిపాలెం నుంచి ఎక్కువ సంఖ్యలోనే హాజరైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి అనుమానితులను వైద్యఆరోగ్యశాఖ గుర్తించి క్వారంటైన్‌కు తరలించింది.


కొత్త కంటైన్మెంట్లు ఇవే..

ఒంగోలులోని గోపాలనగరం ఎక్స్‌టెన్షన్‌, ఏకలవ్యనగర్‌ ప్రాంతాలే ఇక కంటైన్మెంట్‌లో ఉంటాయి. ఇప్పటి వరకు కంటైన్మెంట్లుగా ఉన్న ఇందిరమ్మకాలనీ, ఇస్లాంపేట తదితర ప్రాంతాలన్నింటిలో  ఎత్తివేయనున్నారు. ఇక జిల్లాలో ఇటీవల కాలంలో కొత్త కేసులు నమోదైన దర్శి, చీమకుర్తి మండలం రాజుపాలెం, కొరిశపాడు మండలం కనగానివారిపాలెం, సంతమాగులూరు, మద్దిపాడు మండలం ఇనమనమెళ్ళూరు ప్రాంతాలకే కంటైన్మెంట్‌ జోన్లుగా ఉంచనున్నారు. ఈ ప్రాంతాల్లోనే నిషేదాజ్ఞలు అమలు చేయనున్నారు. నిబంధనల మార్పుతో ఇక నుంచి బస్సులు నేరుగా ఒంగోలులోకి ప్రవేశించే అవకాశం ఉంది. 


ఎన్టీఆర్‌ ఇళ్ల పరిస్థితిపై లబ్ధిదారుల ఆందోళన 

టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పేరుతో 1000 కుటుంబాలకు చాకిరాల వద్ద ప్రధాన రోడ్డు పక్కనే (జీప్ల్‌సత్రీ) ఎల్‌అండ్‌టీ కంపెనీ ద్వారా గత సీఎం చంద్రబాబునాయుడు కట్టుదిట్టంగా అపార్ట్‌మెంట్‌లు నిర్మించి లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్లు కేటాయించారు. కేటాయించిన అపార్ట్‌మెంట్‌లో చేరే సమయంలో 2019లో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో లబ్ధిదారులు చేరలేదు. వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. వీరంతా ప్రభుత్వానికి నగదు చెల్లించినవారే. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు అపార్ట్‌మెంట్‌ కేటాయించిన లబ్ధిదారులవ్వరూ వైసీపీ అధికారంలోకి వస్తే మిగతా సొమ్ము చెల్లించల్సిన పనిలేదని చెప్పిన సీఎం జగన్‌ ఇప్పుడు వాటిని కేటాయిస్తే చంద్రబాబు మార్కు ఉంటుందని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.


అలాంటిదేమీ లేదు..సింగారావు, ఇన్‌చార్జి తహసీల్దార్‌, కనిగిరి

కనిగిరి పట్టణంలోని పేదలకు పంపిణీ చేయడానికి నింబోడుకొండ ప్రాంతంలో సిద్ధం చేసిన  భూమి మంచిదే. కొందరు పట్టాదారుల నుంచి భూమి కొన్నాం. మార్కెట్‌ రేటు ప్రకారమే కొన్నాం. అందులో ఏమి అవకతవకలు జరగలేదు. అక్కడ అన్ని సౌకర్యాలు కల్సిస్తాం.

Updated Date - 2020-05-29T10:22:42+05:30 IST