రైతులకు తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-12-29T05:19:38+05:30 IST

జిల్లాలో నివర్‌ తుఫాన్‌తో పంటలు దె బ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అదుకోవాలని జనసేన పా ర్టీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ షేక్‌ రియాజ్‌ డిమాండ్‌ చేశారు.

రైతులకు తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలి
కలెక్టరేట్‌ వద్ద నినాదాలు చేస్తున్న జనసేన పార్టీ నాయకులు


ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 28: జిల్లాలో నివర్‌ తుఫాన్‌తో పంటలు దె బ్బతిని తీవ్రంగా నష్టపోయిన  రైతులను ప్రభుత్వం అదుకోవాలని జనసేన పా ర్టీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ షేక్‌ రియాజ్‌ డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.35వేలు ఇవ్వాలని, తక్షణ సాయంగా రూ.10వేలు ఇవ్వా లని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఒంగోలులో సోమవారం ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణవేణికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రియాజ్‌ మాట్లాడుతూ జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులకు నష్టపరిహారం ఇచ్చి అదుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ సాయిబాబా, బోటుకు రమేష్‌, ఇమ్మడి కాశీనాధ్‌, విజయ్‌, గౌతమ్‌, పులి మల్లికార్జున, శివరాం ప్రసాద్‌, తోట రాజశేఖర్‌, నాయకులు సుంకర సాయిబాబా, చిట్టెం ప్రసాద్‌, అడుసుమల్లి వెంక ట్రావు, చనపతి రాంబాబు, మలగా రమేష్‌, ముత్యాల కళ్యాణ్‌, టీ సుబ్బారావు, శ్రీదేవి, ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-29T05:19:38+05:30 IST