రైతు ఉత్పాదక గ్రూపులు ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T06:04:44+05:30 IST

ప్రతి గ్రామ సచివాలయం నుంచి 15 మంది రైతులతో రైతు ఉత్పాదక గ్రూపును ఏర్పాటు చేయాలని మార్కాపురం డీఎల్‌డీవో సాయికుమార్‌ అన్నారు.

రైతు ఉత్పాదక గ్రూపులు ఏర్పాటు చేయాలి


ఎర్రగొండపాలెం, డిసెంబరు 29 : ప్రతి గ్రామ సచివాలయం నుంచి 15 మంది రైతులతో రైతు ఉత్పాదక గ్రూపును ఏర్పాటు చేయాలని మార్కాపురం డీఎల్‌డీవో సాయికుమార్‌ అన్నారు. ఎర్రగొండపాలెంలో మంగళవారం సచివాలయ అగ్రికల్చర్‌, ఉద్యానవన అసిస్టెంట్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మార్కాపురం డిఎల్‌డివో పాల్గొని సూచనలు చేశారు. రైతు ఉత్పాదక గ్రూపుల్లో ఉన్న రైతులు నేరుగా విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, పురుగుమందులు ప్రభుత్వం ద్వారా కంపెనీల నుంచి కొనుగోలు చేయవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఉద్యానవన అధికారి షేక్‌ నబీరసూల్‌, ఏవీ పి వెంకటేశ్వర్లు, ఎంపీఈవోలు, వీఏఏలు, ఉద్యానవన అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T06:04:44+05:30 IST