200 మందికి కంటి పరీక్షలు
ABN , First Publish Date - 2020-12-15T06:20:03+05:30 IST
స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నంద్యాల శ్యాంతిరామ్ సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని సోమవారం నిర్వహించారు.
కొమరోలు, డిసెంబరు 14 : స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో నంద్యాల శ్యాంతిరామ్ సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ వైద్యశిబిరంలో 200 మందికి కంటి పరీక్షలు చేశారు. 150 మందికి పైగా శుక్లాలు, కంటిపై పొరలు గుర్తించారు. 60 మందిని ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. కార్యక్రమంలో ఆదినారాయణ, క్యాంప్ ఇన్‌చార్జి మహేష్, ఆప్తమాలిస్టు ప్రకాశ్, రాంమూర్తి, సుబ్బరాయుడు పాల్గొన్నారు.