-
-
Home » Andhra Pradesh » Prakasam » exize officers ride
-
వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
ABN , First Publish Date - 2020-11-21T05:36:45+05:30 IST
నల్లమల అటవీ ప్రాంతం గంగవరం జాళ్ల వాగులో కాపుకాస్తున్న నాటు సారా బట్టీలపై ఎక్సైజ్ ఎన్‌పోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు.

పుల్లలచెరువు, నవంబరు 20: నల్లమల అటవీ ప్రాంతం గంగవరం జాళ్ల వాగులో కాపుకాస్తున్న నాటు సారా బట్టీలపై ఎక్సైజ్ ఎన్‌పోర్సుమెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఎక్సైజ్ ఉన్నతాధికారుల అధికారుల ఆదేశాల మేరకు నాటుసారా బట్టీలపై దాడులు జరిగాయి. గంగవరం ప్రాంతంలో బట్టీలపై దాడులు చేసి సారా కోసం నిల్వ ఉంచిన 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. దాడుల్లో ఎన్‌పోర్సుమెంట్ ఎస్సై రాఘు, కానిస్టేబుల్ అన్నమరాజులు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.