ప్రాణాయామంతో కరోనా దూరం
ABN , First Publish Date - 2020-11-14T02:53:40+05:30 IST
నిత్యం యోగా, ప్రాణాయామం చేస్తూ ఉంటే కరోనా నుంచి దూరంగా ఉండవచ్చని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ యోగా గురూజీ బి.ఎస్.నారాయణరెడ్డి అన్నారు.
గిద్దలూరు, నవంబరు 13 : నిత్యం యోగా, ప్రాణాయామం చేస్తూ ఉంటే కరోనా నుంచి దూరంగా ఉండవచ్చని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ యోగా గురూజీ బి.ఎస్.నారాయణరెడ్డి అన్నారు. స్థానిక జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల ఆవరణలో యోగా, ప్రాణాయామం, ఇతర ఆసనాల గురించి అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం ఉదయం లేవగానే యోగా, ప్రాణాయామం, చిన్నపాటి ఎక్సర్‌సైజ్ చేయడం వలన రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. సామాజిక దూరంతోపాటు మాస్కులు ధరిస్తూ చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం మంజురేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.