గిరిజనుల కోసం నిత్యావసరాల కిట్లు

ABN , First Publish Date - 2020-04-28T10:35:15+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిపుత్రులను

గిరిజనుల కోసం నిత్యావసరాల కిట్లు

మార్కాపురం, ఏప్రిల్‌ 27 : లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న నల్లమల అటవీ ప్రాంతంలోని గిరిపుత్రులను ఆదుకునేందుకు మార్కాపురం పాండు రంగస్వామి దేవస్థాన సేవా సంఘం సభ్యులు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఐటీడీఏ అధికారి కూనపులి రామకృష్ణకు 250 నిత్యావసర కిట్లను సోమవారం అందజేశారు. 


మార్కాపురంలో ముస్లింలకు.. 

మార్కాపురం (వన్‌టౌన్‌) : పట్టణంలో నివసిస్తున్న పేద ముస్లింలకు టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు వక్కలగడ్డ మల్లికార్జునరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 


తర్లుపాడులో.. 

తర్లుపాడు : తర్లుపాడు రైల్వేగేటు వద్ద నివస్తున్న పేదలకు సోమవారం నిత్యావసర సరుకులతోపాటు, ఒక్కో కుటుంబానికి రూ. 4వేల నగదును తహసీల్దార్‌ మల్లికార్జునప్రసాద్‌ పంపిణీ చేశారు.


Updated Date - 2020-04-28T10:35:15+05:30 IST