అమ్మఒడి అవకతవకలపై విచారణకు ఆదేశం

ABN , First Publish Date - 2020-12-17T05:48:17+05:30 IST

టీచర్ల పున ర్విభజనతోపాటు జగగన్న అమ్మఒడి పథకంలో లబ్ధిపొందేందుకు కొందరు హెచ్‌ఎంలు అక్రమా లకు తెరతీశారు. అలాగే టీచర్‌ పోస్టులు పోకుం డా కాపాడుకునేందుకు కూడా చైల్డ్‌ ఇన్‌ఫోలో అ నర్హులను చేర్చారు.

అమ్మఒడి అవకతవకలపై విచారణకు ఆదేశం

హెచ్‌ఎంలపై క్రమశిక్షణ చర్యలు

 

ఒంగోలు విద్య, డిసెంబరు 16 : టీచర్ల పున ర్విభజనతోపాటు జగగన్న అమ్మఒడి పథకంలో లబ్ధిపొందేందుకు కొందరు హెచ్‌ఎంలు అక్రమా లకు తెరతీశారు. అలాగే టీచర్‌ పోస్టులు పోకుం డా కాపాడుకునేందుకు కూడా చైల్డ్‌ ఇన్‌ఫోలో అ నర్హులను చేర్చారు. జగనన్న అమ్మఒడి పథకం అమలుకు సంబంధించి జారీ అయిన మార్గదర్శ కాలను తుంగలో తొక్కి తక్కువ వయస్సు ఉన్న పిల్లలను కూడా పాఠశాలల్లో నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు దాటిన వి ద్యార్థులను మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొం దిన పాఠశాలల్లో చేర్చుకోవాలి. ఈ విషయాన్ని మొదటి నుంచి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికి జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఐదేళ్లలోపు పిల్లలను కూడా ఒకటో తరగతిలో నమోదు చేసినట్లు చైల్డ్‌ఇన్‌ఫో నివేది కలో బట్టబయలైంది. మండలపరిషత్‌ ప్రాథమి క, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యా యులు ఎక్కువగా ఆ పని చేశారు. వారు స హకారం అందించడంతో అనర్హులకు కూడా అ మ్మఒడి జాబితాలో చోటు లభించింది. శ్రీకాకు ళం, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. అమ్మఒ డి పథకంలో అక్రమాలకు పాల్పడిన హెచ్‌ఎం లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యడైరెక్టర్‌ ఆదేశించారు. అక్రమాలకు పాల్పడి న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్ర ధానోపాధ్యాయులందరికీ సంజాయిషీ నోటీసులు జారీచేయాలని డీఈవోలను ఆదేశించారు. వారి నుంచి సంజాయిషీ తీసుకున్న తరువాత వారిపై చర్యలు తీసుకుంటారు. 


19 వరకు అమ్మఒడి గడువు పొడిగింపు 


జగనన్న అమ్మఒడి 2020-21  విద్యాసంవ త్సరానికి చైల్డ్‌ఇన్‌ఫోలో విద్యార్థుల వివరాల న మోదు గడువును ఈనెల 19 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్య కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేసి నట్లు డీఈవో వీఎస్‌.సుబ్బారావు బుధవారం తె లిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఇంకా నమో దు కావాల్సిన విద్యార్థులు, ప్రస్తుతం చదువుతు న్న విద్యార్థుల వివరాలు అప్‌లోడ్‌ చేసేందు కు ఈ అవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు. అమ్మఒ డికి అర్హత గల విద్యార్థుల తొలిజాబితా ఈనెల 20న పాఠశాలలో పాటు గ్రామ, వార్డు సచివాల యాల్లో ప్రదర్శించాలని డీఈవో కోరారు. 


Updated Date - 2020-12-17T05:48:17+05:30 IST