ఒక సెంటు భూమిలో జీవనం సాధ్యమేనా..?

ABN , First Publish Date - 2020-12-11T05:41:37+05:30 IST

ఒక సెంటు భూమిలో ప్రజలు ఎలా జీవిస్తారో ప్రభుత్వమే చెప్పాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరవది సు బ్బారావు ప్రశ్నించారు.

ఒక సెంటు భూమిలో జీవనం సాధ్యమేనా..?
మాట్లాడుతున్న కరవది సుబ్బారావు




రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌ 


ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 10 : ఒక సెంటు భూమిలో ప్రజలు ఎలా జీవిస్తారో ప్రభుత్వమే చెప్పాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కరవది సు బ్బారావు ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల వంతున ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గురువారం ఒంగో లులోని మల్లయ్యలింగం భవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఒ క కుటుంబంలో భార్యభర్తలతో పాటు కనీసం ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారని తె లిపారు. ఒక్క సెంటు స్థలంలో ఆరుగురు ఏవిధంగా జీవిస్తారో ప్రభుత్వం చెప్పాలని ఆ యన చెప్పారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అర్హులైన పేదలందరికీ ఈనెల 25 ఇవ్వాలని స్థలాలు ఇవ్వాలని కోరారు. టిడ్కో ఇళ్ళను యుద్దప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్‌.వెంక ట్రావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శ్రీపతి ప్రకాశం, సంఘాల నాయకులు మిరియం అంజి బాబు, ఎం.కోటేశ్వరరావు, పాలేటి ఆనంద్‌బాబు, దాసరి సుందరం, దాసరి నాగలక్ష్మి, జయ కుమార్‌, నక్కల శ్రీనివాసరావు, చప్పిడి రవిశంకర్‌, కొప్పోలు సుబ్బారావు, జి.నరసింహా రావు, బి.సుబ్బారావు, జి.మస్తానయ్య, నల్లూరి మురళీ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-11T05:41:37+05:30 IST