పొగాకు రైతుల రుణాల రీషెడ్యూల్‌కు కృషి

ABN , First Publish Date - 2020-03-02T10:49:33+05:30 IST

పొగాకు రై తులు బ్యాంకుల్లో తీసుకున్న రుణా ల రీషెడ్యూల్‌కు ప్రయత్నిస్తానని బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునా

పొగాకు రైతుల రుణాల రీషెడ్యూల్‌కు కృషి

బోర్డు చైర్మన్‌ రఘునాథ్‌బాబు 


ఎం. నిడమలూరు (టంగుటూరు), మార్చి 1 : పొగాకు రై తులు బ్యాంకుల్లో తీసుకున్న రుణా ల రీషెడ్యూల్‌కు ప్రయత్నిస్తానని బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునా థ్‌బాబు అన్నారు.  ఎం. నిడమలూరులో ఆదివారం నిర్వహించిన పొగాకు రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.  పొగాకు రైతులను ఈ ఏడాది అకాల వ ర్షాలు దెబ్బతీశాయన్నారు. ఈ దృష్ట్యా రుణాలు రీషెడ్యూల్‌ చేయాల్సిన అవ సరం ఉందన్నారు.


ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు. ఈఏడాది పొగాకులో ఐదు రకాల కొత్త వంగడాలు ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. పొగాకు క్యూరింగ్‌లో ఈ ఏడాది నూతన పద్ధతలకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించామన్నారు. విశ్రాంత శాస్త్రవేత్త బెజవాడ నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్‌ యార్లగడ్డ అంక మ్మచౌదరి, ఆర్‌ఎం ఉమామహేశ్వరరావుపాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T10:49:33+05:30 IST