ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించవద్దు

ABN , First Publish Date - 2020-12-12T05:29:24+05:30 IST

: ట్రాఫిక్‌ సమస్య పెరగడానికి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడపడమే కారణమవుతోందని మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌ అన్నారు.

ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించవద్దు

మార్కాపురం డీఎస్పీ కిశోర్‌కుమార్‌

గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 11 : ట్రాఫిక్‌ సమస్య పెరగడానికి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడపడమే కారణమవుతోందని మార్కాపురం డీఎస్పీ  కిశోర్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన గిద్దలూరు పోలీసుస్టేషన్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా సర్కిల్‌ పరిధిలో నెలకొన్న అంశాల గురించి సీఐ సుధాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా గిద్దలూరులో ట్రాఫిక్‌ సమస్య వేధిస్తున్నదని, ప్రతి వాహనదారుడు బాధ్యతగా ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటి స్తూ ప్రమాదాలను నివారించే విధంగా వ్యవహరించాలన్నారు. సర్కిల్‌ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్లలో నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ ఉద్యోగులు, ఇతర శాఖల ఉద్యోగులు కూడా ప్రతి సోమవారం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించే స్పందన కార్యక్రమంలో నేరుగా ఎస్‌పి సిద్దార్ధకౌశల్‌తో మాట్లాడవచ్చన్నారు. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు, మతపరమైన విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో సర్కిల్‌ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:29:24+05:30 IST