ప్రతి ఇంటికీ రక్షిత నీరు అందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2020-12-08T05:24:48+05:30 IST

ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

ప్రతి ఇంటికీ రక్షిత నీరు అందించడమే లక్ష్యం
ఇన్‌టెక్‌వెల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి


 ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి

మార్కాపురం, డిసెంబరు 7: ప్రతి ఇంటికీ రక్షిత తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని వెలిగొండ ప్రా జెక్ట్‌లో భాగమైన గొట్టిపడియ గ్యాప్‌ వద్ద ఏడు నియోజకవర్గాలకు తాగునీటిని అం దించే ఇన్‌టెక్‌ వెల్‌ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసంద ర్భంగా మాట్లాడుతూ సుమారు రూ.45 కోట్ల తో నిర్మిస్తున్న ఇన్‌టెక్‌ వెల్‌ ద్వారా జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి, ఎర్ర గొండపాలెం, కొండపి, కందుకూరు నియో జకవర్గాల పరిధిలో  36 మండలాల్లోని 1678 గ్రామాల్లో 1.71 కోట్ల మందికి రక్షిత తాగునీరు సరఫరా జరుగుతుందన్నారు. 2051 నాటికి పెరిగే జనాభాకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించారని చెప్పారు. ఇన్‌టెక్‌వెల్‌ నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవు తుందని ఆయన వెల్లడిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ ఎల్ల య్య, ఎర్రగొండపాలెం ఏ ఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, సుధాకర్‌ ఇన్‌ఫ్రా కాంట్రాక్టర్‌ రమణారెడ్డి, వాల్మీకి కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ నల్లబోతుల కొం డయ్య తదితరులు పాల్గొ న్నారు. తొలుత మం డలంలోని వేముల కోటలో రూ.17.50 లక్షలతో నిర్మిస్తున్న హెల్త్‌ సెంటర్‌కు మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డితో కలిసి నాగా ర్జునరెడ్డి భూమి పూజ చేశారు. 

Updated Date - 2020-12-08T05:24:48+05:30 IST