-
-
Home » Andhra Pradesh » Prakasam » DRDA PD transfer
-
డీఆర్‌డీఏ పీడీ బదిలీ
ABN , First Publish Date - 2020-11-25T06:23:50+05:30 IST
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ ఎలీషా బదిలీ అయ్యారు.

ఒంగోలు నగరం, నవంబర్ 24 : జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ ఎలీషా బదిలీ అయ్యారు. ఆయన పీడీగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా గడవక ముందే బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మాతృ సంస్థ అయిన ఆడిట్ శాఖకు ప్రభుత్వం తిప్పిపంపింది. కొత్త ప్రాజెక్టు డైరెక్టర్‌గా భూగర్భ జలశాఖ అధికారి బాబూరావును నియమించినట్లు తెలిసింది. ఆయన గతంలో జిల్లాలోనే ఏపీడీగా పనిచేశారు.