సచివాలయం తనిఖీ
ABN , First Publish Date - 2020-12-20T06:18:45+05:30 IST
మండలంలోని ఆకవీడు సచివాలయాన్నీ డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి సాయికుమార్ శనివారం తనిఖీ చేశారు.

రాచర్ల, డిసెంబరు 19 : మండలంలోని ఆకవీడు సచివాలయాన్నీ డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి సాయికుమార్ శనివారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సమావేశమై ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వం పెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులకు దక్కేటట్లు చూడాలని వాలంటీర్లను ఆదేశించారు. రాచర్ల ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్‌తో సమావేశమై ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు సకాలంలో అందేలా చూడాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో సయ్యద్ మస్తాన్‌వలి, పంచాయతీ కార్యదర్శి గణేష్, వెలుగు ఏపీఎం రఘునాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.