ఐక్యంగా అభివృద్ధి చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-12-12T05:14:32+05:30 IST
కలిసికట్టుగా ఉండి గ్రామాలను అ భివృద్ధి చేసుకోవాలని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బా చిన కృష్ణచైతన్య అన్నారు.
కృష్ణచైతన్య
అద్దంకి, డిసెంబరు 11 : కలిసికట్టుగా ఉండి గ్రామాలను అ భివృద్ధి చేసుకోవాలని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బా చిన కృష్ణచైతన్య అన్నారు. సంతమాగులూరు మండలం కుం దుర్తికి చెందిన పలు కుటుంబాలు శుక్రవారం అద్దంకిలో కృష్ణ చైతన్య సమక్షంలో పార్టీలో చేరారు. కూచిపూడి కోటేశ్వరరావు, కఠారి ముసలయ్య, సాతులూరి కొండలు, కనకా శ్రీనివాసరావు, కూచిపూడి రామారావు ఆధ్వర్యంలో పలు కుటుంబాలు చేరగా, కృష్ణచైతన్య వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు అడవి శ్రీనివాసరావు, ఊట్ల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.