దోర్నాల ఎస్‌ఐ అబ్దుల్‌రెహమాన్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-09-01T18:04:57+05:30 IST

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దోర్నాల ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌రెహమాన్‌పై..

దోర్నాల ఎస్‌ఐ అబ్దుల్‌రెహమాన్‌ సస్పెన్షన్‌

గుడ్లూరు, కొమరోలు ఎస్‌ఐలపై తీవ్ర చర్యలకు ఆదేశం 

ముగ్గురు ఎస్‌బీ సిబ్బంది సాధారణ విధులకు బదిలీ


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దోర్నాల ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌రెహమాన్‌పై వేటు పడింది. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌ సోమవారం ఉత్తర్వు లు ఇచ్చారు. గుడ్లూరు ఎస్సై వై. పాండురంగారావు, కొమరోలు ఎస్‌. మల్లికార్జునరావుపై తీవ్రమైన చర్యలకు ఆదేశించారు. బాధ్యతా రాహి త్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు అధికారులు, సిబ్బందిపై ఇటీవల ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. నిఘా విభాగం ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని కట్టుతప్పిన వారిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇటీవల దోర్నాల ఎస్‌ఐతోపాటు, గుడ్లూరు, కొమరోలు ఎస్సైలను వీఆర్‌కు పిలిపించారు. వారిపై ఐజీకి నివేదిక పంపారు. ఆ మేరకు దోర్నాల ఎస్‌ఐపై ఐజీ చర్యలు తీసుకున్నారు.


గుడ్లూరు, కొమరోలు ఎస్సైలపై సస్పెన్షన్‌ కంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేయాలని ఆయన ఆదేశించారని ఎస్పీ తెలిపారు.  అలాగే స్పెషల్‌ బ్రాంచ్‌లో పనిచేస్తున్న కె. వివేక్‌, ఎస్‌ఏ రెహమాన్‌, ఎం. వెంకటేశ్వర్లును ఆ విభాగం నుంచి తొలగించి సాధారణ విధులకు బదిలీ చేసినట్లు ఎస్పీ చెప్పారు. వరుసగా పోలీసు అధికారులు, సిబ్బం దిపై వేటుపడుతుండటంతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగె డుతున్నాయి. ఎవరిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారోనని ఆందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2020-09-01T18:04:57+05:30 IST