అనుకోని సెలవులు

ABN , First Publish Date - 2020-03-25T10:20:50+05:30 IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసమని ఇప్పటికే ఒకసారి పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి.

అనుకోని సెలవులు

పట్టు పెంచుకుందామిలా

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు

పిల్లలూ ఆటలకోసం బయటకు రావద్దు


ఒంగోలు(జడ్పీ), మార్చి 24 : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసమని ఇప్పటికే ఒకసారి పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి. కరోనా వల్ల ఈ నెల 31వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మంగళవారం ప్రకటించారు. ఏటా మార్చి, ఏప్రిల్‌ నెలలు విద్యార్థులకు పరీక్షల సీజన్‌. ఏడాది పాటు పడిన కష్టానికి గీటురాయిగా పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని ఉత్సాహపడుతుంటారు. తాజాగా పరీక్షలు మళ్లీ వాయిదా పడటంతో వారిలో నిరాశ ఏర్పడింది. పరీక్షలు ఎంత అవసరమో, కరోనా మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కోవడం అంతకన్నా అవసరం. అదనంగా దొరికిన ఈ సమయాన్ని విద్యార్థులు సానుకూల దృక్పథంతో ఆలోచించి సబ్జెక్టుపై మరింత పట్టు పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి. కీలకమైన ఆంగ్లంతో పాటు గణితం, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్టులపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించవచ్చు. దీంతోపాటు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ వంతు బాధ్యతగా ఇద్దరుముగ్గురికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి.


మామూలు రోజుల్లో ఒత్తిడిని జయించటానికి కొంతసేపు ఆటలకు ప్రాధాన్యం ఇస్తారు.  ప్రపంచం మొత్తాన్ని మృత్యుకూపంలోకి నెట్టడానికి ఒక మహమ్మారి కాచుకుని ఉంది.  పిల్లలకు అంతగా ఇంట్లో బోర్‌ కొడితే రోజు చదివే పాఠ్యపుస్తకాలు కాకుండా కాసేపు కథల పుస్తకాలు చదవడమో, లేక కుటుంబసభ్యులతో కూర్చుని కాసేపు మాట్లాడడం  చేయాలి. అంతేగాని బయటకు వెళ్లి ఆటలు ఆడే కార్యక్రమాలకు కొన్ని రోజులు స్వస్తి పలకాల్సిందే. ఈ సెలవులను ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించడానికి విద్యార్థులకు కొన్ని సూచనలు


వివిధ రకాల మోడల్‌ పేపర్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని సేకరించి సాధన చేయాలి

రేపే పరీక్ష ఉన్నట్లుగా భావించి రివిజన్‌ చేసుకోవాలి

ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువుకుని తమకు తామే కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకుని జవాబులు రాసుకోవాలి

ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో దానికోసం అదనపు సమయాన్ని కేటాయించాలి.


తల్లిదండ్రులు చేయాల్సిన పనులు

విద్యార్థులకు మంచి ఆహారం అందించాలి

మొబైల్స్‌ అవసరమైతే తప్ప పిల్లలకు ఇవ్వకూడదు

పిల్లలు తగినంత సేపు నిద్రపోయేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి

ఆటలు ఆడడం, బయట ప్రదేశాలలో తిరగడం లాంటివి చేయకుండా పిల్లలను కట్టడి చేయాలి

బయట ఆహారం తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

అవసరమైతే పిల్లలను యోగా, వ్యాయామం వంటివి చేసే విధంగా ప్రోత్సహించాలి


పాఠశాలలు ఆన్‌లైన్‌ బాట

ఇప్పటికే కొంత మంది ఉపాధ్యాయులు సామాజిక మా ఽధ్యమాలను ఉపయోగించుకుని విద్యార్థులను గైడ్‌ చేస్తున్నారు. విద్యార్థులకు సందేహాలు తీర్చడంతో పాటు మో డల్‌ పేపర్లు పంపించడంలో వాట్సా్‌పను ఉపయోగించుకుంటున్నారు.వాటిని విద్యార్థులు రాసి తిరిగి ఉపాధ్యాయులకు పంపిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లోనే దిద్ది మార్కులు ఇస్తున్నారు. విద్యార్థులు ఎక్కువగా తప్పులు రాసినట్లయితే సరాసరి వారికే ఫోన్‌ చేసి వివరిస్తున్నారు. పిల్లలకు కూడా ఏదయినా సందేహాలు ఉంటే వాట్సా్‌పలో ఫొటోలు తీసి ఉపాధ్యాయులకు పంపిస్తున్నారు.


అదనంగా వచ్చిన ఈ సమయాన్ని మరింత సన్నద్ధతకు ఉపయోగించుకోవాలి.  పదో తరగతి పరీక్షలే కాదు ఎంసెట్‌, ఐసెట్‌ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు, ఉద్యోగార్థులు అందరికీ తగినంత సమయం చిక్కింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటిపట్టునే ఉండి చదువుకున్నట్లయితే తాము పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. తమ వంతు బాధ్యతగా కరోనా కట్టడిలో తమ తోడ్పాటును అందించిన వారవుతారు.


Updated Date - 2020-03-25T10:20:50+05:30 IST