జీతం కోసం నర్సరీ ఉద్యోగి ఎదురుచూపులు

ABN , First Publish Date - 2020-07-10T10:56:21+05:30 IST

దొనకొండలో ఏర్పాటైన మొక్కల పెంపకం కేంద్రం (నర్సరీ)లో పనిచేస్తున్న ఉద్యోగికి ..

జీతం కోసం నర్సరీ ఉద్యోగి ఎదురుచూపులు

దొనకొండ, జూలై 9 : దొనకొండలో ఏర్పాటైన మొక్కల పెంపకం కేంద్రం (నర్సరీ)లో పనిచేస్తున్న ఉద్యోగికి 15 నెలలుగా జీతాలందక తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నాడు.  షేక్‌ అప్‌రోజ్‌ వ్యక్తిని అటవీ శాఖ సిబ్బంది  న ర్సరీలో రూ.8వేల జీతానికి 15 నెలల క్రితం సూపర్‌వైజర్‌గా నియమించుకున్నారు. నాటి నుంచి నేటికీ ఒక్క రూపాయి జీతం కూడా ఇవ్వలేదు. ఈ విషయమై అటవీ సిబ్బందికి పలుసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు జీతం ఇచ్చేలా చ ర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నాడు. 

Updated Date - 2020-07-10T10:56:21+05:30 IST