దీపావళిని నిరాడంబరంగా జరుపుకోవాలి

ABN , First Publish Date - 2020-11-14T04:58:58+05:30 IST

కరోనా కష్టకాలంలో దీపావళి పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

దీపావళిని నిరాడంబరంగా జరుపుకోవాలి




 ఎస్పీ సిద్ధార్థకౌశల్‌


ఒంగోలు(క్రైం), నవంబరు 13 : కరోనా కష్టకాలంలో దీపావళి పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.  టపాసులు కాల్చటం వల్ల వచ్చే పొగ వల్ల కరోనా బారిన పడిన వారికి శ్వాసకోశాలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇందులో భాగంగానే జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు టపాసులు పండుగ రోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే కాల్చాలని కోరారు. రంగులు వెదజల్లే టపాసులు మాత్రామే పేల్చాలని సూచించారు. బాణసంచా అమ్మే దుకాణాల్లో కాలుష్యరహిత టపాసులు విక్రయించాలని పేర్కొన్నారు. షాపులు కొవిడ్‌ నిబంధనలు ప్రకారం కొనుగోలుదారులు ఆరు అడుగలు దూరంలో నిలిచి కొనుగోలు చేయాలన్నారు. ముఖ్యంగా టపాసులు కాల్చే సమయంలో శానిటైజర్‌ చేతులకు రాసుకోకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా 101, 100 నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటను జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.


Updated Date - 2020-11-14T04:58:58+05:30 IST