మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2020-12-02T05:28:37+05:30 IST

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని జిల్లా సాధన ఐక్యవేదిక నాయకులు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కోరారు.

మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలి
కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న ఐక్య వేదిక నాయకులు


మార్కాపురం (వన్‌టౌన్‌), డిసెంబరు 1 :  మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని జిల్లా సాధన ఐక్యవేదిక నాయకులు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కోరారు. ఈమేరకు ఆయనకు మార్కాపురంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం   కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ఉపక్ర మించిన  నేపథ్యంలో మార్కాపురంను జిల్లాగా ప్రకటిస్తే అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకుడు పి.వి.కృష్ణారావు తది తరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-02T05:28:37+05:30 IST