మూడువేల మందికి విటమిన్‌ ట్యాబ్లెట్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-08-01T10:53:29+05:30 IST

కందుకూరు నియోజకవర్గంలో 3వేల మందికి మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి తెలిపారు.

మూడువేల మందికి విటమిన్‌ ట్యాబ్లెట్ల పంపిణీ

కందుకూరు, జూలై 31 : కందుకూరు నియోజకవర్గంలో 3వేల మందికి మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించిన వారికి, కరోనా బాధితుల కాంటాక్ట్స్‌గా ఉన్నవారందరికీ నివారణ  చర్యల లో భాగంగా ఈ ట్యాబ్లెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. కందుకూరు ఏరియా హాస్పటల్‌లో కరోనా బాధితులకు ఉపయోగించడం కోసం రూ.25వేల విలువైన మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లను మాజీ కౌన్సిలర్‌ చీదెళ్ల పిచ్చయ్య కుటుంబ సభ్యులు శుక్రవారం సమకూర్చగా ఎమ్మెల్యే వాటిని హాస్పటల్‌ సూపరింటెండెంట్‌ డా. ఇంద్రాణికి అందజేశారు. 


ఏరియా హాస్పటల్‌లో సెంట్రలైజ్‌డ్‌ ఆక్సిజన్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. కరోనా నివారణ  చర్యల కోసం దాతలు అందజేసిన విరాళాలు  మరో రూ.57 లక్షల వరకు ఉన్నాయని వాటిని అత్యవసర సేవలకు వినియోగిస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ  అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, డాక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-01T10:53:29+05:30 IST