మహిళలకు బాసటగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-09-12T10:24:21+05:30 IST

ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా పొదుపు మహిళలకు బాసటగా నిలుస్తుందని విద్యుత్‌, అటవీ పర్యావరణల శాఖ

మహిళలకు బాసటగా ప్రభుత్వం

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

అట్టహాసంగా ఆసరా చెక్కుల పంపిణీ 

హాజరైన మంత్రి సురేష్‌, కలెక్టర్‌ భాస్కర్‌ 

జిల్లావ్యాప్తంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు


ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 11 : ప్రభుత్వం వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా పొదుపు మహిళలకు బాసటగా నిలుస్తుందని విద్యుత్‌, అటవీ పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్ర వారం స్థానిక కలెక్టరేట్‌లోని స్పందనభవన్‌లో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, కలెక్టర్‌పోలా భా స్కర్‌తో కలిసి పొదుపు మహిళలకు రుణమాఫీ చె క్కులను మంత్రి బాలినేని లాంఛనంగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ ఆసరా పథకంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది ఆసరా పథకాన్ని ఒంగోలులోనే జరపాలని సీఎంను కోరారు.  కాగా ఈ కాన్ఫరెన్స్‌లో సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన బాలసుందరి సీఎంతో మాట్లాడారు. అనంత రం మంత్రి బాలినేని మాట్లాడుతూ ఒంగోలు నగరంలో 24వేల మంది పేదలకు ఇంటి స్థలాలను కచ్చితంగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.


అనంతరం మంత్రి సురేష్‌ మాట్లాడుతూ నవరత్నాలతో మహిళలకు ప్ర భుత్వం అండగా ఉంటుందన్నారు. కలెక్టర్‌ పోలా భా స్కర్‌ మాట్లాడుతూ ఆసరా పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 4,92,321 మంది మహిళలకు తొలివిడతగా రూ.378.88 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 72,767 మంది మహిళలకు రూ.62.21 కోట్లు వారి ఖాతాల్లో జమ చే సినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరి కనకారావు, జేసీ బాపిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శీనారెడ్డి, మోప్మా పీడీ రఘు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నిర్మల, కార్పొరేషన్‌ కమిషనర్‌ నిరం జన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  


మద్దిపాడులో..

వెల్లంపల్లిలో వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని శుక్రవారం ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్‌.సుధార్‌బాబు ప్రారం భించారు. డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ మండవ అ ప్పారావు, గట్టినేని అయ్యన్న, మోరబోయిన సంజీవరా వు, పెనుబోతు రంగారావు, సన్నపురెడ్డి రమణమ్మ, బె జవాడ రాము, బాలాంజనేయరెడ్డి, పోతినేని శ్రీనివాస రావు, ఏపీఎం నరేంద్రకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-12T10:24:21+05:30 IST