-
-
Home » Andhra Pradesh » Prakasam » Dhatta jayanthi
-
వైభవంగా దత్తాత్రేయ జయంతి
ABN , First Publish Date - 2020-12-30T05:51:00+05:30 IST
దత్త జ యంతి సందర్భంగా స్థానిక సాయి బాబా మంది రంలో ఉన్న దత్తాత్రేయ స్వా మికి వైభవంగా పూజలు, అభి షేకాలను మంగళవారం నిర్వహించారు.

కనిగిరి, డిసెంబరు 29 : దత్త జ యంతి సందర్భంగా స్థానిక సాయి బాబా మంది రంలో ఉన్న దత్తాత్రేయ స్వా మికి వైభవంగా పూజలు, అభి షేకాలను మంగళవారం నిర్వహించారు. తొలుత సుప్రభాత సేవతో ప్రారంభ మైన స్వామి కార్యక్రమాలు పంచామృతాభిషేకలు, విశేష పూజలు, సామూహిక పూ జలు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆలయ అర్చకులు ఇందుశర్మ, భార్గవ శర్మ ప్రత్యేక పూ జలు నిర్వ హించారు. భక్తులకు స్వామి విశేష అంకరణలతో దర్శన మిచ్చారు. కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దేవకి సుబ్రమణ్యం, పెన్నా వెంకటేశ్వర్లు, ఏసీ చెంచులు, ముచ్ఛర్ల ధర్మారావు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మార్కాపురం(వన్‌టౌన్) : స్థానిక నెహ్రూ బజార్ లోని షిరిడిసాయి మందిరంలో దత్తాత్రేయ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మందిర కార్యదర్శి గోపాలుని హరిహరరావు మాట్లాడుతూ నేటి నుంచి వారం రోజులపాటు భక్తులు సామాజికంగా గురుచరిత్ర గ్రంథాన్ని సప్తాహపారాయణం చేస్తారన్నారు. ఉదయం దత్తత్రేయ స్వామి మూలవిరాట్‌కు అర్చకులు శివకుమార్ ఆధ్వర్యంలో మాహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మీ గణపతి హోమం, దత్తహోమం చేశారు.