వెల్లంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-13T06:38:44+05:30 IST

జిల్లా పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఆద్వర్యంలో మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజరు సీహెచ్‌.రామాంజమ్మ శనివారం ప్రారంభించారు.

వెల్లంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కొనుగోలు ప్రారంభిస్తున్న రామాంజమ్మ


త్రిపురాంతకం, డిసెంబరు 12 : జిల్లా పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ఆద్వర్యంలో మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజరు సీహెచ్‌.రామాంజమ్మ శనివారం ప్రారంభించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఏ గ్రేడు రకానికి రూ. 1888, సాదారణ రకానికి రూ. 1868 ఇస్తామన్నారు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో సమాఖ్య డైరెక్టరు కందుల వెంకటేశ్వర్లు, ఏవో కె.నీరజ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:38:44+05:30 IST