-
-
Home » Andhra Pradesh » Prakasam » devotees rush to simgarakomda
-
శింగరకొండలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2020-12-27T06:15:57+05:30 IST
శింగరకొండకు శనివారం భక్తులు భారీ సంఖ్యలో మాలధారులు తరలివచ్చారు. ఆదివారం హనుమత్ వ్రతా న్ని పురస్కరించుకొని శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ఆం జనేయస్వామి మండల, అర్ధ మండల దీక్ష తీసుకున్న భక్తులు దీక్ష విరమణ చేయనున్నారు.

నేడు హనుమత్ వ్రతం
అద్దంకి, డిసెంబరు 26 : శింగరకొండకు శనివారం భక్తులు భారీ సంఖ్యలో మాలధారులు తరలివచ్చారు. ఆదివారం హనుమత్ వ్రతా న్ని పురస్కరించుకొని శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ఆం జనేయస్వామి మండల, అర్ధ మండల దీక్ష తీసుకున్న భక్తులు దీక్ష విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అసిస్టెంట్ క మిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన స్వామి వారి పల్లకి సేవలో భక్తులు పాల్గొన్నారు