కనిగిరి అభివృద్ధికి కేంద్రం నిధులు రాబడతా

ABN , First Publish Date - 2020-11-22T04:45:57+05:30 IST

కనిగిరి ప్రాంత అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.

కనిగిరి అభివృద్ధికి కేంద్రం నిధులు రాబడతా


ఎంపీ మాగుంట 

కనిగిరి, నవంబరు 21 : కనిగిరి ప్రాంత అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు.  స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన  విలేకరుల సమా వే శంలో ఎంపీ మాట్లాడారు. కనిగిరి ప్రాంతంతో తన కుటుంబానికి సన్నిహిత సం బంధాలున్నాయన్నారు. తన సోదరుడు సుబ్బరామిరెడ్డి కనిగిరి ప్రాంతానికి మం చినీటి సరఫరాకు కృషి చేశారని గుర్తు చేశారు.  ఫ్లోరిన్‌ రహిత కనిగిరి కోసం ఇంటింటికీ మంచినీటి సరఫరాకు జనజీవన్‌ మిషన్‌ పథకం కింద రూ.870 కోట్లతో పనులు ప్రారంభిస్తున్నట్లు మాగుంట తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

భైరవకోనలో వసతిగృహం ప్రారంభం

సీఎస్‌పురం : ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవకోనలో  పలు కార్యక్ర మాల ను ఎంపీ మాగుంట శ్రీనువాసులరెడ్డి, ఎమ్మెల్యే బుర్రా ప్రారంభించారు. రూ.65 లక్షలతో గురుసదన్‌ పేరుతో నిర్మించిన యాత్రికుల వసతిగృహం, నిత్య అన్న దాన సత్రం, యాగశాలను ఎంపీ, ఎమ్మెల్యే ప్రారంభించారు.   అంతక ముందు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానాల కమిటీ చైర్మన్‌లు కమ్మనేతి సుబ్బమ్మ, దుగ్గిరెడ్డి జయరెడ్డి, వైస్‌ చైర్మన్‌ వెంకటరెడ్డి, భూమిరెడ్డి ప్రభంజన, ఈవోలు కె.నవీన్‌కుమార్‌, ఎన్టీ రామ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Read more