మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ABN , First Publish Date - 2020-12-02T05:27:06+05:30 IST

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అ న్నారు. మంగళవారం మండలంలోని కొత్తపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
కొత్తపాలెంలో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి


మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌

తాళ్లూరు, డిసెంబరు 1: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అ న్నారు. మంగళవారం మండలంలోని కొత్తపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లో 90 శాతం పనులు పూర్తి చేసినట్టు చెప్పారు. గ్రామాలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేసినట్టు చెప్పారు. కొత్తపాలెం గ్రామంలో మాజీ జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి విజ్ఞప్తి మేరకు రూ.85.40 లక్షలతో సీసీరోడ్లు, సైడ్‌ కాలువలు, మంచినీటి ట్యాంక్‌, పాఠశాల ప్రహరీగోడలను నిర్మించినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ మండల ఇన్‌చార్జి మద్దిశెట్టి రవీంద్ర, మండల అధ్యక్షుడు ఐ. వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు, తహసీల్థార్‌ పి.బ్రహ్మయ్య, మాజీ జడ్పీటీసీలు మారం వెంకటరెడ్డి, ఎల్‌జీ వెంకటేశ్వరరెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కాగా, గ్రామంలో జరిగిన రాష్ట్ర కిసాన్‌ సెల్‌ మాజీ డైరెక్టర్‌ మారం వెంకట సుబ్బారెడ్డి ప్రథమ వర్ధంతిలో ఎమ్మెల్యే వేణుగోపాల్‌ పా ల్గొని నివాళులర్పించారు.  


Updated Date - 2020-12-02T05:27:06+05:30 IST