కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-07-08T11:12:19+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నియోజవకవర్గంలో నిబంధనలను కఠినతరంగా అమలుచేస్తున్నారు.

కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌

పలు రహదారులు ముళ్లకంచెలతో మూత


చీరాల, జూలై 7 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నియోజవకవర్గంలో నిబంధనలను కఠినతరంగా అమలుచేస్తున్నారు. ప్రధానంగా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేశారు. పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి వెలుపలకు రావాలన్నా వీలులేని పరిస్థితి ఏర్పడింది. దర్బార్‌ రోడ్డును మూసివేయటంతో గృహోపకరణాలకు మరమ్మతులు చేయించుకొనే పరిస్థితి లేకుండా పోయింది.  కొన్ని నిర్ణీత నిబంధనల మేరకు అత్యవసరమైన దుకాణాలు తెరిచేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-07-08T11:12:19+05:30 IST