రేపు కొత్త పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రకటన
ABN , First Publish Date - 2020-03-02T11:02:45+05:30 IST
ఇటీవల కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాలను తయారు చేసి ఈనెల 3న ప్రకటించాలని జిల్లా పంచాయతీ

ఒంగోలు(కలెక్టరేట్), మార్చి 1 : ఇటీవల కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితాలను తయారు చేసి ఈనెల 3న ప్రకటించాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్‌కుమార్ ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆదివారం జారీచేశారు.
2019 జనవరి ఒకటిన ప్రాతిదినకన తీసుకొని అర్హులైన ఓటర్ల జాబితాలను అధికారులు సిద్ధంచేశారు. కాగా, రాష్ట్రంలో కొత్తగా 777 కొత్త గ్రామపంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 14 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాట య్యాయి. ఆయా పంచాయతీలకు సంబంధించి కొత్తగా ఓటర్ల జాబితాలను సిద్ధంచేసి ప్రచురించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. అన్ని పంచాయతీలకు ఒకే విధంగా ఉండేలా ఓటర్ల జాబితాలను, వార్డుల విభజనను సిద్ధం చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచా యతీల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలన్నారు.