-
-
Home » Andhra Pradesh » Prakasam » Dealers Expectations for Commission
-
కమీషన్ కోసం డీలర్ల ఎదురుచూపులు
ABN , First Publish Date - 2020-05-13T10:53:22+05:30 IST
ప్రభుత్వం మూడు పర్యాయాలు బియ్యం పంపిణీ చేసినా రేషన్ డీలర్ల కు ఇచ్చే కమీషన్ ఇంతవరకు

పట్టించుకోని ప్రభుత్వం
కష్టతరంగా మారిన
రేషన్‌షాపుల నిర్వహణ
ఒంగోలు(కలెక్టరేట్), మే 12: ప్రభుత్వం మూడు పర్యాయాలు బియ్యం పంపిణీ చేసినా రేషన్ డీలర్ల కు ఇచ్చే కమీషన్ ఇంతవరకు ఇవ్వకపోవడంతో డీ లర్లలో ఆందోళన నెలకొంది. రేషన్ ద్వారా వచ్చే కమీ షన్‌తోనే రూం అద్దెతో పాటు అందులో పనిచేసే వ్యక్తికి వేతనాన్ని డీలర్లు ఇస్తారు. లాక్‌డౌన్ నేపథ్యం లో మార్చి నెల నుంచి ఇప్పటివరకు మూడు పర్యా యాలు కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కంది పప్పు, శనగలను పంపిణీ చేశారు.
జిల్లావ్యాప్తంగా 2151 రేషన్‌షాపు లు ఉండగా 9.91 లక్షల మంది కార్డు దారులు ఉన్నారు. కార్డుదారులకు ద్వారా పంపిణీచేసే సరుకులకు ఒ క్కో కిలోకు రూపాయి కమీషన్‌ను ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి నెలా కమీ షన్‌ను చేస్తేనే అద్దెతో పాటు కరెం టు బిల్లు, నిత్యావసర వస్తువులు తూకం వేసేందుకు ఏర్పాటు చేసు కున్న పనిమనిషికి చెల్లింపులు చేస్తుంటారు. అయితే, మూడు పర్యాయలుగా ఇవ్వాల్సిన కమీషన్ విషయం లో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంపై డీలర్లలో అసహనం వ్యక్తం అవుతున్నది.
కాగా ప్రభుత్వం ఒక విడత పంపిణీ చేసిన రేష న్‌కు మాత్రం పౌర సరఫరాల కార్పొరేషన్ అనుబం ధంగా ఉన్న సప్లయీస్ చైన్ మేనేజ్ మెంట్(ఎస్ వీఎం)కు ఒక విడత కమీషన్ మంజూరు చేసినట్లు తెలి సింది. అయితే, ఆ కమీషన్‌ను డీలర్లకు నేరుగా ఇచ్చే అవకాశం లేదు. డీలర్లు డీడీలు తీసే సమ యంలో ఆ డబ్బులను మినహాయించుకొని డీడీలు తీసుకొనున్నట్లు సమాచారం.
కమీషన్ మంజూరు చేయాలి
రేషన్ సరుకులు పంపిణీ ద్వారా వచ్చే కమీషన్ ద్వారానే డీల ర్లు ఆధారపడి పనిచేస్తున్నారు. కార్డుదారులకు ప్రభుత్వ మార్గద ర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేసినా ఇంతవరకు కమీషన్ ఇచ్చిన పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
- కూరపాటి సుబ్బారావు, డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు