డీడీఎల్‌వో తనిఖీ

ABN , First Publish Date - 2020-12-27T06:45:19+05:30 IST

మండలంలోని రామసముద్రం గ్రామ సచివాలయాన్ని మార్కాపురం డీడీఎల్‌వో సాయికుమార్‌ శనివారం తనిఖీ చేశారు.

డీడీఎల్‌వో తనిఖీ
వివరాలు తెలుసుకుంటున్న డీఎల్‌డీవో


త్రిపురాంతకం, డిసెంబరు 26 : మండలంలోని రామసముద్రం గ్రామ సచివాలయాన్ని మార్కాపురం డీడీఎల్‌వో సాయికుమార్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. గ్రామంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వద్దకు వెళ్లి పనిముట్లు తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ఆర్‌బీకే, సచివాలయాల వద్ద ఇసుక లేకపోవడంపై ఇంజనీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు.అనంతరం త్రిపురాంతకం ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసి ఎంపీడీవో సుదర్శనం, ఇతర అధికారులతో మాట్లాడారు. 


Updated Date - 2020-12-27T06:45:19+05:30 IST