-
-
Home » Andhra Pradesh » Prakasam » cricket tornament began
-
క్రీడల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
ABN , First Publish Date - 2020-12-27T06:37:38+05:30 IST
క్రికెట్ ఆటలో యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని త్రిపురాంతకం ఎంఈవో టీ.మల్లికార్జున నాయక్ అన్నారు.

పెద్ద దోర్నాల, డిసెంబరు 26 : క్రికెట్ ఆటలో యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని త్రిపురాంతకం ఎంఈవో టీ.మల్లికార్జున నాయక్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో యూత్ సొసైటీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు పోటీలను శనివారం ఎంఈవో మల్లికార్జున నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. తద్వారా క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, ఐక్యత శారీరక ధృఢత్వం అలవడుతాయన్నారు. కార్యక్రమంలో ఈ.బాబు, గంటా రమణ, వెచ్చా సత్యం తదితరులు పాల్గొన్నారు.