నష్టం అపారం.. కనీసం పలకరించే వారే లేరు !
ABN , First Publish Date - 2020-12-06T05:17:35+05:30 IST
‘‘రైతుల కష్టం వర్ణనాతీతం. ప్రభుత్వపరంగా కనీసం పలకరించినవారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు కంటికి కనిపించలేదు. ముందుగా ఎమ్మెల్యే ఏలూరి, ఇప్పుడు మీరు వచ్చి మా బాధలు తెలుసుకుంటున్నారు. పంటలు పూర్తిగా నష్టపోయాం. మరలా మొదలు నుంచి పెట్టుబడులు పెట్టుకోవాలి. ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. మీరు ప్రభుత్వం మెడలు వంచి మాకు సాయం అందేలా చే యాలి’’ అని రైతులు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులను కోరారు.

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఎదుట వాపోయిన రైతులు
చీరాల, డిసెంబరు 5 : ‘‘రైతుల కష్టం వర్ణనాతీతం. ప్రభుత్వపరంగా కనీసం పలకరించినవారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు కంటికి కనిపించలేదు. ముందుగా ఎమ్మెల్యే ఏలూరి, ఇప్పుడు మీరు వచ్చి మా బాధలు తెలుసుకుంటున్నారు. పంటలు పూర్తిగా నష్టపోయాం. మరలా మొదలు నుంచి పెట్టుబడులు పెట్టుకోవాలి. ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. మీరు ప్రభుత్వం మెడలు వంచి మాకు సాయం అందేలా చే యాలి’’ అని రైతులు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావులను కోరారు. నివర్ తుఫాన్‌తో కురిసిన వర్షాలకు రైతులు పంట నష్టపోయిన నేపఽథ్యంలో వారికి భరోసా కల్పిం చేందుకు వచ్చిన లోకేష్, ఎమ్మెల్యే ఏలూరి అధ్యక్షతన కారంచేడులో జరిగిన రైతులతో ముఖాముఖి కార్య క్రమంలో పాల్గొని వారి బాధలు విని వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రశంసిస్తాం. లేదంటే ప్రభుత్వాన్ని కూల్చేద్దాం. అందు కు అందరూ సిద్ధ్దమేనా అని అడగ్గా రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది.
రైతులతో సంభాషణ ఇలా...
కారంచేడుకు చెందిన రైతు దగ్గుబాటి హరిప్రసాద్‌తో
లోకేష్ : పంటల పరిస్థితి ఎలా ఉంది ?
రైతు : పూర్తిగా నష్టపోయాం.. ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. అమరావతి రైతులకు ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ఐదురోజులకు వీరు దా రికి వస్తారా. ఇసుకను బంగారం చేశారు. నిత్యావ సరాల ధరలు పెరిగాయి. అన్నివిధాల నష్టపోతున్నాం. మాపరంగా మీరు పోరాడాలి. మేం వెన్నంటి ఉంటాం.
లోకేష్ : అందుకే వచ్చాం.. అధైర్యపడొద్దు.. ఎన్ని ఎకరాలు సాగు చేశారు?
రైతు : 15 ఎకరాలు. సగం సొంతం.. సగం కౌలు
లోకేష్ : ఏ పంట సాగుచేశారు, పెట్టుబడి ఎంత పెట్టారు?
రైతు : మిరప, రూ. 10లక్షలు ఖర్చుపెట్టా.
లోకేష్ : ప్రస్తుతం ఎంత నష్టం జరిగింది?
రైతు : మరలా తొలినుంచి పెట్టుబడులు పెట్టాలి..
లోకేష్ : అధికారులు ఎవరన్నా వచ్చి విచా రించారా?
రైతు : ఎవరూ రాలేదు
కొడవలివారిపాలెంకు చెందిన కొడవలి సురేంద్రతో..
లోకేష్ : మీరు ఎన్ని ఎకరాలు సాగుచేశారు?
రైతు : 6 ఎకరాలు. మిర్చి సాగుచేశాను
లోకేష్ : ఇప్పటివరకు ఎంత ఖర్చుపెట్టారు?
రైతు : రూ.4.70లక్షలు ఖర్చయ్యింది
లోకేష్ : ప్రస్తుతం పంట ఎలా ఉంది.?
రైతు : సగానికి పైగా నష్టమే ... మరలా మొదలు నుంచి సాగుచేపట్టాలి..
లోకేష్ : రైతుభరోసా కేంద్రాల్లో సబ్సిడీ లేదా?
రైతు : అక్కడ ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. బయట మార్కెట్ కన్నా అక్కడ బస్తాకు రూ.30 అద నపు ధర ఉంది.
లోకేష్ : అన్నదాతలు ఇన్ని కష్టాలు పడుతున్నా ప్ర భుత్వంలో స్పందన లేదు. ఇది దున్నపోతు ప్రభుత్వం. ఖచ్చితంగా కదలిక తెద్దాం. అధైర్యపడొద్దు. అండగా ఉంటాం. ఉమ్మడిగా ఉద్యమిద్దాం.
కారంచేడుకు చెందిన కౌలు రైతు రామానాయుడు
రైతు : నేను కౌలు రైతును, సాగు చేసిన పంట నష్టపోయా.. కానీ భూయజమానులకు కౌలు చెల్లిం చాల్సిన పరిస్ధితి.
లోకేష్ : రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేవరకు పోరాడదాం.. హెక్టార్‌కు రూ.30వేలు నష్టపరిహారం చె ల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అధైర్యపడొద్దు. అసెం బ్లీలో చంద్రబాబు, మన సభ్యులు మాట్లాడిన తర్వాతే కొంత కదలిక వచ్చింది. పూర్తిస్థాయిలో న్యాయం జరి గేంత వరకు పోరాడదాం.