ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2020-12-27T06:42:23+05:30 IST

సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక సీపీఐ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సీపీఐ ఆవిర్భావ దినోత్సవం
పుల్లలచెరువులో జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు


త్రిపురాంతకం, డిసెంబరు 26 : సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక సీపీఐ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి బాణాల రామయ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సీపీఐ ఆవిర్బవించిందన్నారు. కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి దాసరి మల్లిఖార్జున, పి.నాగేశ్వరరావు, ఖాశీం, తిరుమలయ్య, లింగయ్య, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

పుల్లలచెరువు : సీపీఐ పార్టీ ఆవిర్భావ దీనోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుల్లలచెరువులో సీపీఐ పార్టీ  96 వ ఆవిర్భావ దీనోత్సవ వేడుకల్లో  భాగంగా బస్టాండ్‌ సెంటరులో జెండాను ఆవిష్కరించారు.ీ ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి  జివి గురునాధం మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం సీపీఐ నిరంతరం  పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు శ్రీనివాసచారి ,సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

కంభం : మండలంలోని కందులాపురం కూడలిలో భారత కమ్యూనిస్టు పార్టీ గిద్దలూరు నియోజకవర్గ కార్యదర్శి షేక్‌ మహమ్మద్‌ ఇబ్రహీం ఆధ్వర్యంలో సీపీఐ జెండాను ఆవిష్కరించి 96వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఐ ఏర్పడినప్పటి నుంచి కార్మికుల కోసం, పేదప్రజల కోసం చేసిన కృషిని వివరించారు. కార్యక్రమంలో  సీపీఐ నాయకులు ఉస్మాన్‌బేగ్‌, సుబ్బరంగయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T06:42:23+05:30 IST