ఎంసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-24T11:37:00+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల్లో 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ ఇంజనీరింగ్‌ కోర్సులు, ఫార్మసీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది.

ఎంసెట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ప్రారంభం

తొలి రోజు 140 మంది హాజరు

నేడు 20001 నుంచి 50వేల

 ర్యాంకు వరకూ నిర్వహణ 


ఒంగోలు విద్య, అక్టోబరు 23 : ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల్లో 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ ఇంజనీరింగ్‌ కోర్సులు, ఫార్మసీలో  ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 1 నుంచి 20వేల ర్యాంకు వరకూ అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు అవకాశం ఇచ్చారు. మొదటి రోజు 140 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నర్రా శ్రీనివాసరావు తెలిపారు. ఆన్‌లైన్‌లో ‘88‘యువర్‌ సర్టిఫికెట్స్‌ నాట్‌ వెరిఫైడ్‌, ప్లీజ్‌ కాంటాక్టు నియరెస్టు హెల్ప్‌లైన్‌ సెంటర్స్‌ ఫర్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌’ అని మెసేజ్‌ వచ్చిన వారు మాత్రమే హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు హాజరు కావాలని చెప్పారు. శనివారం 20001 నుంచి 50వేల ర్యాంకు వరకూ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-10-24T11:37:00+05:30 IST