-
-
Home » Andhra Pradesh » Prakasam » Cotan crop visit
-
తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2020-11-25T05:35:59+05:30 IST
పత్తి పంటలో తెగుళ్ల నివారణకు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని గుంటూరు లాం ఫాం శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీలక్ష్మీ, డాక్టర్ డయానా గుర్తించారు.

దర్శి, నవంబరు 24 : పత్తి పంటలో తెగుళ్ల నివారణకు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని గుంటూరు లాం ఫాం శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీలక్ష్మీ, డాక్టర్ డయానా గుర్తించారు. జిల్లాలోని మార్టురు, యద్దనపూడి, దర్శి, కురిచేడు, దొనకొండ, ఇంకొల్లు, పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో సాగు చేసిన పత్తి పంటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం పత్తిపంటకు గులాబిరంగు పురుగు ఆశించిందని నివారణకు క్లోరీపైరీపాస్ లేదా కినాల్‌పాస్ పురుగు మందును పిచకారి చేయాలన్నారు. పలుచోట్ల తెల్ల, పచ్చదోమలు ఉన్నట్లు గుర్తించామని నివారణకు ప్లోనికామైడ్ మందును నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, రైతులు ఉన్నారు.