16 మందికి కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-17T10:17:41+05:30 IST

స్థానిక క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న 16 మందికి శనివారం వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

16 మందికి కరోనా పరీక్షలు

పీసీపల్లి, మే 16: స్థానిక క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న 16 మందికి శనివారం వైద్యాధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యాఽధికారణి డాక్టర్‌ సృజన అధికారుల సూచనల మేరకు క్వారంటైన్‌ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న చెన్నై, మహారాష్ట్ర, బెంగళూరు, బిహార్‌ నుంచి వచ్చిన వసల కార్మికులకు కరోనా వ్యాధి నిర్ధారణ కోసం వారి నుంచి శ్వాబ్‌లు సేకరించారు. వీటిని  ఒంగోలులో ట్రూనాట్‌ మిషన్‌పై పరీక్షించనున్నారు. వీటి ఫలితాలు ఆదివారం వస్తాయని ఆమె తెపారు. కాగా తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 20 మందికి నోటీసులు అందించి హోమ్‌ కార్వంటైన్‌లో ఉండాలని డాక్టర్‌ సృజన, ఎస్‌ఐ మధుసూదన్‌రావు ఆదేశించి వారిని క్వారంటైన్‌ సెంటర్‌ నుంచి పంపించి వేశారు.

Updated Date - 2020-05-17T10:17:41+05:30 IST