గ్రామాల్లోనూ కట్టడి కట్టుదిట్టం
ABN , First Publish Date - 2020-04-26T12:18:09+05:30 IST
జిల్లాలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయిలోనూ లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేయడంపై యంత్రాంగం దృష్టి సారించింది.

యంత్రాంగం ప్రత్యేక చర్యలు
పటిష్టంగా లాక్‌డౌన్ అమలు
ఒంగోలు, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామస్థాయిలోనూ లాక్‌డౌన్ పటిష్టంగా అమలు చేయడంపై యంత్రాంగం దృష్టి సారించింది. అందుకోసం ఆయా నియోజకవర్గ, మండల స్థాయిలో ఉన్న టాస్క్ ఫోర్స్ కమిటీలు చర్యలు చేపట్టాయి. ఉదయం మూడు గంటలపాటు సడలింపు సమయం అనంతరం పట్టణ ప్రాంతాల్లో నిరంతర తనిఖీలతో పోలీస్ యంత్రాం గం అప్రమత్తంగానే పని చేస్తోంది.
అయితే గ్రామాల్లో ఎలాంటి చర్యలు ఉండటం లేదు. మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీలు, కూడలి గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళ జన సంచారం అధికంగా ఉంటోంది. దీంతో గ్రామీణ ప్రాం తాల్లోనూ కట్టడి చర్యలు కఠినం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా జిల్లాలో 34వ రోజైన శనివారం కూడా లాక్‌డౌన్ ప్రశాంతంగా, సంపూ ర్ణంగానే కొనసాగింది.