పునరావాస కేంద్రంలో కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-04-26T12:15:07+05:30 IST

స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలోని రిలీఫ్‌ సెంటర్‌లో ఉన్న వారికి వైద్యాధికారులు శనివారం కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ..

పునరావాస కేంద్రంలో  కరోనా పరీక్షలు

పీసీపల్లి, ఏప్రిల్‌ 24: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలోని రిలీఫ్‌ సెంటర్‌లో ఉన్న వారికి వైద్యాధికారులు శనివారం కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మండలంలోని గుదేవారిపాలెం, రామాపురం గ్రామాలకు చెందిన వారు వృత్తిరీత్యా గుంటూరులో నివాసం ఉంటున్నారు.  ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో గుంటూరు నుంచి ఇటీవల తమ స్వగ్రామాలకు వచ్చారు. అయితే అధికారులు వారందరినీ స్థానిక ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు.


వారం రోజులుగా వారిని ఇక్కడే ఉంచారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు శనివారం రిలీఫ్‌ సెంటర్‌లో ఉన్న 25 సంవత్సరాలు పైబడిన 35  మందికి కరోనా ప్రత్యేకవైద్యాధికారిణి స్రవంతి శ్వాబ్‌లను సేకరించి  పరీక్షల కోసం ఒంగోలు పంపించారు. కాగా రిలీఫ్‌ సెంటర్‌లో 50 మంది ఉన్నప్పటికీ వారిలో 35 మందికి మాత్రమే శ్వాబ్‌లను తీశారు. స్థానిక అధికారులు పర్యవేక్షించారు. Updated Date - 2020-04-26T12:15:07+05:30 IST