నల్లగండ్లలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-05-30T10:29:40+05:30 IST

మండల పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గ్రామంలో కలకలం రేగింది.

నల్లగండ్లలో కరోనా కలకలం

హనుమంతునిపాడు, మే 29: మండల పరిధిలోని నల్లగండ్ల గ్రామంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గ్రామంలో కలకలం రేగింది. ఈ నెల 24న గ్రామానికి వచ్చిన వలస కూలీలను పరీక్షించగా వారిలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో నల్లగండ్ల గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. పాజిటివ్‌ వచ్చిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరు చెన్నైలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో స్వీపర్లుగా, అటెండర్లుగా పనిచేసేవారు. పాజిటివ్‌ వచ్చిన వారిని ఒంగోలు రిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2020-05-30T10:29:40+05:30 IST