వెయ్యి దాటేశాయి!

ABN , First Publish Date - 2020-07-05T11:29:00+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌లు 1000 దాటేశాయి. రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాగే కొనసాగితే పరిస్థితి చేజారుతుం

వెయ్యి దాటేశాయి!

1011కు చేరిన కరోనా కేసులు

మార్చి 19న తొలిపాజిటివ్‌

తాజాగా మరో 41 నమోదు

పామూరులో అత్యధికంగా 12

మున్ముందు ఇంకా పెరిగే అవకాశం


ఒంగోలునగరం, జూలై 4 : జిల్లాలో కరోనా పాజిటివ్‌లు 1000 దాటేశాయి.  రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాగే కొనసాగితే పరిస్థితి చేజారుతుం దేమోనన్న భావన యంత్రాంగంలో నెలకొంది. శనివారం జిల్లాలో మరో 41 పాజిటివ్‌లు నమోదయ్యాయి. గురువారం నాటికి జిల్లాలో కేసుల సంఖ్య 900 కాగా, శుక్రవారం 70 నమోదయ్యాయి. దీంతో  మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 970కి చేరింది. శనివారం మరో 41 కేసులు వెలుగు చూశాయి. వీటితో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య  1011కి పెరిగింది. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు గత మార్చి 19న నమోదు కాగా శనివారం నాటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది.


మున్ముందు వైరస్‌ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు నెలల్లో వెయ్యికి దాటిని కేసులు ఇక రెట్టింపు సంఖ్యలో పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శనివారం నమోదైన 41 కేసుల్లో 12 పామూరులో వెలుగు చూశాయి. ఒంగోలులో ఆరు కేసులు బయటపడ్డాయి. చీరాలలో 11 మంది వైరస్‌ బారిన పడగా వీటిలో పేరాలలో నాలుగు ఉన్నాయి. జయంతిపేట, ఆదినారాయణపురం, యుజిలిపేట తదితర ప్రాంతాల్లోనూ కేసులు వచ్చాయి. శింగరాయకొండ మండలం బింగినపల్లిలో రెండు పాజిటివ్‌లు, శింగరాయకొండలో ఒకటి, టంగుటూరు మండలం జమ్ములపాలెంలో ఒక కేసు నమోదయ్యాయి.

Updated Date - 2020-07-05T11:29:00+05:30 IST