ప్రకాశం జిల్లాలో తగ్గిన వైరస్‌ ఉధృతి.. కొత్తగా 315 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-10-12T17:18:12+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి తగ్గింది. గతంలో రోజుకు వెయ్యికిపైగా నమోదైన కేసులు..

ప్రకాశం జిల్లాలో తగ్గిన వైరస్‌ ఉధృతి.. కొత్తగా 315 కేసులు నమోదు

104 మంది డిశ్చార్జ్‌, ఇద్దరి మృతి


ఒంగోలు: జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి తగ్గింది. గతంలో రోజుకు వెయ్యికిపైగా నమోదైన కేసులు ఇప్పుడు 500లోపుగానే వెలుగు చూ స్తున్నాయి. ఆదివారం 315 పాజిటివ్‌లు న మోదయ్యాయి. వాటిలో అత్యధికంగా ఒం గోలులో 51 ఉన్నాయి. మార్కాపురంలో 22, కందుకూరులో 19, కారంచేడులో 17, బల్లికురవలో 15, కనిగిరిలో 12, అద్దంకిలో 8 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒంగోలు రిమ్స్‌లో 1230 పడకలు ఉండగా 569 మంది పాజిటివ్‌ బాధితులు వైద్యం పొం దుతున్నారు. 533 పడకలు ఖాళీగా ఉన్నా యి. గడిచిన 24 గంటల్లో 104 మంది కరో నా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇద్దరు మరణించారు. 

Updated Date - 2020-10-12T17:18:12+05:30 IST