ప్రకాశం జిల్లాలో.. కొత్తగా 404 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-09-25T18:01:20+05:30 IST

జిల్లాలో కొత్తగా 404 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా..

ప్రకాశం జిల్లాలో.. కొత్తగా 404 పాజిటివ్‌ కేసులు

ఒంగోలు: జిల్లాలో కొత్తగా 404 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం జిల్లా వ్యాప్తంగా 6500 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా 404 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒంగోలులో 63 మందికి, మార్కాపురంలో 21 మందికి, చీరాల 19, చీమకుర్తి 14, అద్దంకి 11, కందుకూరులో ఇద్దరికి కరోనా సోకింది. జిల్లాలో 1505 మంది చికిత్స పొందుతున్నారు.అన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 647 మంది ఉండగా, రిమ్స్‌లో 752, కిమ్స్‌లో 72, సంఘమిత్ర 75, నల్లూరి నర్సింగ్‌ హోమ్‌లో 38, వెంకటరమణ నర్సింగ్‌ హోమ్‌ 26, ప్రకాశం ఆసుపత్రిలో 25 మంది చికిత్స పొందుతున్నారు. 98 మంది డి శ్చార్జ్‌ కాగా,నలుగురు మరణించారు.రిమ్స్‌లో నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న 28 మంది హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. Updated Date - 2020-09-25T18:01:20+05:30 IST