ప్రకాశం జిల్లాలో మరో 438మందికి పాజిటివ్.. మరో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2020-09-01T17:44:21+05:30 IST
జిల్లాలో సోమవారం మరో 438 కరోనా కే సులు నమోదయ్యాయి. గత పది రోజులతో..

ఒంగోలు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం మరో 438 కరోనా కే సులు నమోదయ్యాయి. గత పది రోజులతో పోల్చుకుంటే కొంత తగ్గడం స్వల్ప ఊరటని స్తోంది. తాజా ఫలితాలను పరిశీలిస్తే ఒంగో లులో 83, కొత్తపట్నంలో 45, కందుకూరు లో 25, కారంచేడులో 20, టంగుటూరులో 20, చిన్నగంజాంలో 19, అద్దంకిలో 18, నాగులుప్పలపాడులో 18, గుడ్లూరులో 17 కేసులు వచ్చాయి. చీమకుర్తిలో 16, వేట పాలెంలో 14, మార్టూరులో 10, మార్కాపురంలో 9 పాజిటివ్‌లు నమోదయ్యాయి. మొత్తం 1,951 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం రాత్రికి 24 గంటల వ్య వధిలో 103 మంది కొవిడ్ నుంచి కోలు కుని డిశార్జి కాగా ఇద్దరు మృతి చెందారు.