బ్రాండెడ్‌ సరుకంతా వైసీపీ నేతలకే

ABN , First Publish Date - 2020-05-09T09:04:05+05:30 IST

మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో బ్రాండెడ్‌ మద్యం అధికార పార్టీ నేతలకే చేరింది.

బ్రాండెడ్‌ సరుకంతా వైసీపీ నేతలకే

స్థానిక పోలీసులు సైతం సహకారం 


ముండ్లమూరు, మే 8 : మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో బ్రాండెడ్‌ మద్యం అధికార పార్టీ నేతలకే చేరింది. గొడుగు, మాస్క్‌, టోకెన్‌ ఉన్న వారికే మద్యం సరఫరా చేస్తామని చెప్పిన ఎక్సైజ్‌ అధికారుల మాటలు ఆచరణలో నిష్ఫలమయ్యాయి. ముండ్లమూరు, పెదఉల్లగల్లు, మారెళ్లలో షాపుల వద్ద కేవలం గంట మాత్రమే టోకెన్లకు మందు పంపిణీ చేశారు. ఆ తరువా త టోకెన్లు లేకపోయినా కొంతమంది వైసీపీ నాయకులు నేరుగా షాపుల వద్దకు వచ్చి సూపర్‌వైజర్‌, సేల్స్‌మన్లతో మాట్లాడుకొని బ్రాండెడ్‌ సరుకును తమ అనుచరులకు విచ్చలవిడిగా ఇప్పించుకోవడంతోపాటు అదనంగా 100 నుంచి 200 సీసాలను తీసుకెళ్లారు. దీనికి స్థానిక పోలీసులు సైతం సహకరించడం గమనార్హం. ముండ్లమూరు షాపు నుంచి కొందరు వ్యక్తులు ఒక్కొక్కరు 10 నుంచి 20 ఫుల్‌ బాటిల్స్‌ తీసుకొని అద్దంకి మండలంలో అధిక రేట్లకు అమ్మకాలు చేసినట్లు సమాచారం. ముండ్లమూరులో మద్యం సరఫరా చేస్తున్న విధానాన్ని దర్శి డీఎస్పీ ప్రకాశ్‌రావు పరిశీలించారు.

Updated Date - 2020-05-09T09:04:05+05:30 IST