వినియోగదారుల చట్టాన్ని ఉపయోగించుకోవాలి

ABN , First Publish Date - 2020-12-25T05:37:57+05:30 IST

వినియోగదారులు మోసపోకుండా చట్టాన్ని ఉపయోగిం చుకోవాలని డీఎస్‌వో సురేష్‌ పేర్కొన్నారు. గురు వారం ఒంగోలులోని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ హాలులో జాతీయ వినియోగదారుల దినోత్సవ స భలో ఆయన మాట్లాడారు.

వినియోగదారుల చట్టాన్ని ఉపయోగించుకోవాలి

డీఎస్‌వో సురేష్‌


ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 24 : వినియోగదారులు మోసపోకుండా చట్టాన్ని ఉపయోగిం చుకోవాలని డీఎస్‌వో సురేష్‌ పేర్కొన్నారు. గురు వారం ఒంగోలులోని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ హాలులో జాతీయ వినియోగదారుల దినోత్సవ స భలో ఆయన మాట్లాడారు. మోసపోయిన విని యోగదారులు జిల్లా వినియోగదారుల కమిషన్‌ లో కేసులు నమోదు చేసి అతి తక్కువ వ్యయం తో సత్వర న్యాయం పొందవచ్చని ఆయన చెప్పా రు. ప్రతి కొనుగోలుకు తప్పని సరిగా రశీదు తీసు కోవాలన్నారు. తూనికలు, కొలతల శాఖ అసిస్టెం ట్‌ కంట్రోలర్‌ మూర్తి మాట్లాడుతూ తూకాల వల్ల మోసపోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపా రు. రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య గౌరవ చైర్మన్‌ ఎం.నాగేశ్వరరావు, నాయకులు వెం కటేశ్వర్లు, గౌసియాబేగం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-25T05:37:57+05:30 IST