గల్లీరోడ్ల మూతతో...గందరగోళం
ABN , First Publish Date - 2020-04-08T11:22:25+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా ఒంగోలు నగరాన్ని పోలీసులు అష్ఠ దిగ్బంధనం చేశారు. నగరం చుట్టూ ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు

ఒంగోలు(క్రైం), ఏప్రిల్ 7: లాక్‌డౌన్ కారణంగా ఒంగోలు నగరాన్ని పోలీసులు అష్ఠ దిగ్బంధనం చేశారు. నగరం చుట్టూ ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు అనేక ప్రాంతాల్లో పోలీసులు పి కెట్‌లు నిర్వహిస్తున్నారు. జన సంచారాన్ని కట్టడికి చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో నగరంలో కరో నా పాజిటీవ్ కేసులు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్‌లు గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో 300 మీటర్ల చుట్టు పక్కల ప్రాంతాన్ని పోలీసులు బారికే డ్‌లతో బంధించారు. ఇది ఇలా ఉండగా నగరంలో గల్లీలను కూడా ఆయా ప్రాంతంలోని యువకులు ముసివేస్తున్నారు.
అందుకు కారణం తమ గల్లీలో వాహన రాకపోకలు పెరిగాయనే ఉద్ధేశంతో రోడ్లకు అడ్డుగా టైర్లు, చిల్లకంప వేస్తున్నారు. దీంతో అత్యవ సర పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల నుంచి బయటకు రావడం కష్టంగా మారింది. అంతేకాదు కొన్నిచోట్ల వివా దాలకు దారి తీస్తోంది. ఇలాంటి గల్లీ రోడ్లపై పోలీసులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. ఉదాహరణకు నగరంలోని మంగమూరురోడ్డు జంక్షన్‌ను పోలీసులు పూర్తిగా మూసివేశారు. దీంతో సాయిబాబా గుడి వద్ద నుంచి మంగమూరు రోడ్డుకు వెళ్ళడం గగనంగా మా రింది. ఆప్రాంతంలో ఉన్న గల్లీలను అన్నీ మూసివేశా రు.
ఇలా నగరంలో అనేక ప్రాంతాలలో అనధి కారం కం గా రోడ్లు మూసి వేసి ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలో దీనిపై చిన్నచిన్న గొడవులు కూడ జరిగాయి. ఇప్పటికైయినా పోలీసులు స్పందించి గల్లీ రోడ్లలో రాకపోకలపై నెలకొన్న సమస్వ లను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.